బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉప్పెన సినిమాతోనే ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తూ.. తన రెమ్యునరేషన్ని అమాంతంగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ మూవీలో హద్దు దాటేసినా నటించినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో హీరో నాని గా నటించడం విశేషం. ఇక అంతే కాకుండా బంగార్రాజు సినిమాలో నాగచైతన్య కు జోడిగా నటిస్తోంది కృతి శెట్టి.

అయితే తాజాగా వినిపిస్తున్న మాట ఏమిటంటే.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని వార్త మేకర్స్ అనౌన్స్ చేశారు. సుకుమార్ అంటేనే ప్రతి చిత్రంలో ఐటెం సాంగ్ కంపల్సరిగా ఉంటుందని చెప్పవచ్చు.పార్ట్-1 లో సమంత ఇక పార్ట్ 2 లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుకోసం ఉప్పెన బ్యూటీని రంగంలోకి దించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.

Share.