హైదరాబాదులో నివాసం ఉంటున్న ఆఫ్రికన్ లపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలో ఉంటున్న వారి వీసాలను కూడా పరిశీలించగా కొన్ని షాకింగ్ విషయాలు తెలిసినట్టు సమాచారం. వారి గడువు ముగిసిన ఇంకా చాలామంది ఇండియా లోనే ఉన్నారట, వారు చేసిన సర్వేలో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్టయినవారిలో కమెడియన్ చిచా చార్లెస్ కూడా ఉన్నారు. తన తెలుగు పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ ఇండియాలో మాత్రం అక్రమంగా నివసిస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.చార్లెస్ స్వస్థలం ఆఫ్రికాలోని యుగాండా. ఈయన తన ఉన్నత చదువులకోసం 2017 లో ఇండియా కి వచ్చారు. దాంతో వరంగల్ లోని ఒక కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్నాడు.
వచ్చీరాని తెలుగు పదాలతో ముచ్చటైన పాటలతో అలరిస్తూ ఉంటాడు చిచా చార్లెస్.తన ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వీడియో లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఆ తర్వాత జబర్దస్త్, లో కొన్ని ప్రోగ్రాములు చేసినట్లు సమాచారం. యాంకర్ లలో ఎంతోమంది చార్లెస్ కు మంచి స్నేహితులు కూడా ఉన్నారట. బోనాల పండుగ సందర్భంగా వచ్చిన మంగ్లీ పాట లోని మెరిశాడు చార్లెస్.