బ్రహ్మానందం తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ కమెడియన్ లలో ఒకరు. ఇక వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా తన పేరును నిలుపుకున్నాడు. ఒకానొక సమయంలో తెలుగునాట ఆయన లేకుండా సినిమాలే ఉండేవి కావు. ఒక సంవత్సరానికి దాదాపుగా 20 సినిమాలు విడుదల అయితే అన్ని సినిమాలలో ఈయన కచ్చితంగా ఉండేవాడు.
ఇక ఈయన రెమ్యూనరేషన్ కూడా మామూలుగా ఉండేది కాదు స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా రెమ్యునరేషన్ అందుకునేవాడు. ఒక్కొక్కసారి ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇచ్చే వారు. అయితే బ్రహ్మానందం ఇంత డబ్బు సంపాదన వెనుక ఒక బలమైన కారణం ఉన్నదట.
అదేమిటంటే ఈయన సినిమాలకు వచ్చే సమయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడట. నేను మొదటగా తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో నాటకాలపై మక్కువతో ఉండేదట. ఇక అదే సమయంలో సినిమాల్లోకి రావాలని ప్రయత్నించాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ ఆయనకు అంత ఈజీగా అవకాశాలు రాలేదు. చివరికి అవకాశం వచ్చాక ఆయన తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అందుకే డబ్బు విషయంలో ఆయన వెనక్కితగ్గే వాడు కాదు అన్నట్లుగా సమాచారం. తన అవమానాలను దిగమింగుకొని తన సక్సెస్ తో అందరికీ సమాధానం చెప్పగలిగాడు బ్రహ్మానందం.