‘బ్రాండ్ బాబు’ థియేట్రికల్ ట్రైలర్

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్నడ హీరో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్రాండ్ బాబు’, ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ సినిమాకి కథని అందించగా ప్రభాకర్ ఈ సినిమాకి దర్శకుడిగా పని చేసారు. మారుతీ గత సినిమాల్లో లాగానే ఈ చిత్రంలో కూడా హీరోకి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది..అదేంటంటే హీరో బ్రాండెడ్ వస్తువులని మాత్రమే వాడటం. ట్రైలర్ లో హీరో కి డైమండ్ అనే ఒక పెద్ద కంపెనీ కూడా ఉంటుందని చూపించారు దర్శకుడు. ప్రతి వస్తువుని బ్రాండ్ చూసి కొనే హీరో అనుకోకుండా ఒక పని మనిషితో ప్రేమలో పడతాడు అదే ఈ సినిమా ప్రధాన కథాంశం. అక్కడ నుండి హీరో తన ప్రేమని ఏ విధంగా గెలుచుకున్నాడో సినిమాలో చూడాల్సిందే.
చిత్ర బృందం వారు ఈ సినిమాని ఆగష్టు 3 న విడుదల చేయనున్నారు, ఎస్ శైలేంద్ర బాబు ఈ సినిమాని నిర్మించారు.

Share.