టాలీవుడ్లో తన కమెడితో పద్మశ్రీ అవార్డు అందుకున్న నటుడు బ్రహ్మానందం. టాలీవుడ్లో ఎంతో క్రేజ్ ఉన్న కమెడియన్ బ్రహ్మానందం ఆస్తులు కోట్లల్లో ఉంటాయట.. కోట్లంటే కోట్లు కాదు.. దాదాపు రూ.800కోట్ల ఆస్తి వరకు ఉంటుందని సిని పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తండ్రి కోట్ల రూపాయలు సంపాదించాడు కానీ కొడుకులను గాలికి వొదిలేసాడనే ఆపవాదు మాత్రం లేకపోలేదు…
కమెడియన్ బ్రహ్మానందం రోజుకు తన రెమ్యూనరేషన్‌గా దాదాపు రూ.7లక్షలు తీసుకుంటాడనే టాక్ ఫిలింనగర్లో ఉంది. 1990లో సంపాదించిన సంపాదనంతా రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడిగా పెట్టడంతో అది కలిసొచ్చి ఇప్పుడు కోట్లకు చేరిందట. అయితే సిని రంగంలో మోహన్‌బాబు, అల్లు అరవింద్, బెల్లంకొండ సురేష్, నటుడు బ్రాహ్మజీ, హీరో శ్రీకాంత్ తన నటవారసులను సిని రంగ ప్రవేశం చేయించారు.
అయితే బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతంను కూడా సిని రంగ ప్రవేశం చేయించాడు. అలాగే చిన్న కొడుకు సిద్దార్థ్ దర్శకుడిగా, హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకు అదును కోసం ఎదురు చూస్తున్నాడట. అయితే అటు పెద్ద కొడుకును సపోర్టు చేసుందుకు గానీ, ఇటు చిన్న కొడుకు ను సిని రంగ ప్రవేశం చేయించేందుకు బ్రహ్మానందం ఎలాంటి ఆసక్తి చూపడం లేదట. కనీసం తాను సంపాదించిన ఆస్తిపాస్తుల్లోంచి కనీసం చిల్లిగవ్వ ఇవ్వకుండా కట్టడి చేస్తూ కొడుకుల కేరీర్‌ను గాలికొదిలేశాడట బ్రహ్మీ.
కొందరు సిని పెద్దలు కొడుకులను స్టార్ చేయాలని తెగ ఆరాట పడుతుంటే బ్రహ్మీ మాత్రం కొడుకులపై కానీ పైసా ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదట. చిన్న కొడుకు దర్శకుడిగా మారితే పెట్టుబడి పెట్టేందుకు కానీ, ఎదైనా నిర్మాతలతో మాట్లాడి సెట్ చేసేందుకు బ్రాహ్మానందం చొరవ చూపడం లేదట. ఇక పెద్ద కొడుకు హీరోగా రాణించాలన్నా తండ్రి సపోర్టు చేయడం లేదట. సో ఇదేమి చిత్రమో కదా…