నటి సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ” యూ టర్న్ ” చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ పాత్రలో నటించారు. నగరంలోని ఒక ప్రధాన ఫ్లై ఓవర్ దగ్గర ఉన్న ఒక యూ టర్న్ సమీపంలో జరిగే యాక్సిడెంట్స్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో సమంత నటనకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి, మరియు సెలబ్రిటీస్ నుండి ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇక ఇదే రోజు విడుదలైన నాగ చైతన్య ‘ శైలజా రెడ్డి అల్లుడు ‘ కూడా మంచి హిట్ టాక్ తో దూసుకు పోతుంది.
ఇక అందులో భాగంగా నటుడు బ్రహ్మాజీ సమంత కి ట్విట్టర్ ద్వారా సినిమా సక్సెస్ పై తనకి విషెస్ చెబుతూ ” సమంత సమంత ఎక్కడచూసినా నువ్వే, ఏ పీ, తెలంగాణ, తమిళ్ నాడు అంత నువ్వే అని సరదాగా కామెంట్ చేసారు..ఈ ట్వీట్ కి సమంత రిప్లై చేస్తూ ” సర్ మీకు ధన్యవాదాలు ” అని సమాధానం ఇచ్చారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో బ్రహ్మాజీ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం.
🙏🙏sirrrrrrrrrrr https://t.co/ADTeZmhRAH
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 14, 2018