బోయపాటి శ్రీను వినయవిధేయ రామ సినిమాకు ముందు వరకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. ఆ సినిమాకు ముందు వరకు బోయపాటితో సినిమా చేసేందుకు ఎంతోమంది స్టార్ హీరోలు లైన్లో ఉన్నారు. ఆ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. చివరకు రామ్‌చరణ్ సైతం ఇలాంటి సినిమా చేసినందుకు ఫ్యాన్స్ తనను క్షమించాలని ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేశాడు.
ఆ తర్వాత బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు బాలయ్య సైతం బోయపాటిని కాదని కేఎస్.రవికుమార్‌తో కమిట్ అయ్యాడు. బాలయ్య ఛాన్స్ ఇచ్చినా రూ.60 కోట్లు కాదని… సినిమా బడ్జెట్ రూ.40 కోట్ల కంటే తక్కువలోనే ఉండాలన్న కండీషన్ పెట్టాడట. దీంతో బోయపాటి ఇప్పుడు బాలయ్య సినిమాకు బడ్జెట్ తగ్గించే పనిలో ఉన్నాడట.
బోయపాటి ఇంత చేసినా బాలయ్య ఈ సినిమా లేటెస్ట్ వర్షన్ పై ఎలాంటి కామెంట్లు చేయలేదట. బాగుందా..? లేక, బాగాలేదా..? అనే విషయం కూడా ఇంకా బాలయ్య చెప్పలేదట. దీంతో బాలయ్యతో సినిమా ఉంటుందో ? లేదో ? తెలియక బోయపాటి సైతం డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఒకే ఒక్క ప్లాప్‌తో బోయపాటి కెరీర్ పూర్తిగా రివర్స్ అయ్యింది.