హీరోయిన్లు మోసగాళ్లకు రిలేషన్స్ పెట్టుకోవడం కొత్తేమీ కాదు. కొందరు నిందలు మోయటమే కాకుండా జైలు జీవితాన్ని కూడా గడిపేవారు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు మౌనిక బేడి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఒకసమస్య ఎదురైంది. ఇక సుఖేష్ చంద్రన్ అనే వ్యక్తితో కొంతకాలం పాటు రిలేషన్ లో ఉంది జాక్వెలిన్. అతడు మనీ ల్యాండరింగ్ కేసులో దొరికిపోయాడు. దీంతో అధికారులు సుఖేష్ ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఇక ఆ తర్వాత ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ విచారణకు పిలుస్తున్నారు. అందులో జాక్వెలిన్ తనతో రిలేషన్ లో ఉందని ఖరీదైన బహుమతులను పొందిందని సుఖేష్ తో మనీ లాండరింగ్ వ్యవహారాలలో కూడా జాక్వెలిన్ కి సంబంధం ఉండే అవకాశం ఉందని ఆమెను అరెస్టు కూడా చేశారు.ఆ తరువాత బెయిల్ పై ఆమె విడుదలైంది కానీ రెగ్యులర్గా విచారణకు హాజరవుతూనే ఉంది. ఇది కాస్త పక్కన పెడితే ఆమె కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది.
సుఖేష్ తో రిలేషన్ కారణంగా తన జీవితం నాశనం అయ్యిందని సినిమా అవకాశాలు దూరమైపోతున్నాయని వాపోతోంది. అతడు మోసగాడని విషయం తనకు తెలియదని అతని తప్పులను తెలుసుకోలేకపోయానని వివరించింది జాక్వెలిన్. ఇక ఆయన సన్ టీవీ అధినేతగా సుఖేష్ తనను తాను పరిచయం చేసుకున్నాడని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తనకు బంధువు అని చెప్పాడని ఆమె తెలిపింది. సుఖేష్ నుంచి గిఫ్ట్ తీసుకున్న విషయాన్ని అంగీకరించింది జాక్వెలిన్. ఇక సుఖేష్ సౌత్ సినిమాల్లో నటించడానికి తనని రికమెండ్ చేస్తానని చెప్పాడని వివరించింది. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే జాక్వెలిన్ కి సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలన్నీ కోల్పోయాడు.