రాజకీయ నేతలు, సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని మధ్యప్రదేశ్‌లో అయిదుగురు మహిళలు సాగించిన సెక్స్ స్కాండల్ వెలుగు చూడడంతో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇక మధ్యప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అయితే ఇది ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఇదిలా ఉంటే ఈ స్కాంలో ఐదుగురు మహిళలు ఉన్నతాధికారులు, మంత్రులు, చివరకు ఓ మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్‌ను సైతం మగువలతో ట్రాప్ చేయించినట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక వీరు తమ పనుల కోసం బ్లాక్‌మెయిల్ చేసేందుకు మొత్తం 40 మంది సెక్స్ వర్కర్లతో పాటు బాలీవుడ్‌కు చెందిన ద్వితీయ శ్రేణి, బీ గ్రేడ్ హీరోయిన్లను కూడా వీళ్లకు ఎరగా వేసినట్టు తెలుస్తోంది. స్పై కేమెరాతో షూట్ చేసిన 92 హై క్వాలీటీ వీడియోలు కూడా వీరి దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోల్లో పలువురు బాలీవుడ్ హీరోయిన్లు చేసిన రాసలీలల గుట్టు కూడా ఉందట.
ఇక పోలీసుల విచారణలో ఈ కుంభకోణంలో బాలీవుడ్‌కు చెందిన ద్వితీయ శ్రేణి హీరోయిన్ల వీడియోలు కూడా వారికి లభ్యమైనట్టు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో నటించిన సెకండ్ హీరోయిన్లు కూడా వీరి వలకు చిక్కి సర్వం సమర్పించుకున్నారని.. వీరి రాసలీలల వీడియోలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
ఈ వ్యవహారానికి సూత్రధారిగా వ్యవహరించిన శ్వేతా విజయ్ జైన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణం మధ్యప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకపోవచ్చునని తెలిపారు. పలువురు సీనియర్ అధికారులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ ముఠాకు చిక్కారు.