బింబిసార నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా , స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ద్వారా బింబిసార. ఈ సినిమాకు దర్శకుడిగా విశిష్ట్ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈనెల 29వ తేదీ విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్ శనివారం ప్రకటించారు.. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ కింద “అతను చాలా క్రూరమైన వాడు.. తన భూభాగాన్ని గుర్తించడానికి వస్తున్నాడు “అంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది.

చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ క్రూరమైన రాజుగా ఒక శక్తివంతమైన పాత్రలో మనకు కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా తెలుగు తో పాటు అన్ని ప్రధాన భారతీయ ప్రాంతీయ భాషలలో విడుదలకానుంది . అంతేకాదు ఈ సినిమా విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

Share.