తమన్నా సింహాద్రి బిగ్ బాస్ షో ద్వారా ఈమె అందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న ఆమె ఆమె విచిత్ర ప్రవర్తన వల్ల, రవి కృష్ణ తో గొడవల వల్ల మూడు వారాలకి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక బిగ్ బాస్ షో లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సో గురించి ఇప్పటి వరకు మాట్లాడని ఈమె తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ చెయ్యండి అంటూ ముందుకు వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ కు మద్దతు తెలుపుతున్నాను అంటూ వీడియోను రిలీజ్ చేసింది.
చాలా రోజుల నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సాధారణంగా ట్రాన్స్జెండర్ అనగానే చాలామందికి రోడ్ల మీద అడుక్కునే వారే గుర్తొస్తారు. కానీ అయిన వాళ్ళు అందరికీ దూరమై, హైదరాబాద్ కు వచ్చి ఎన్నో కష్టాలను అనుభవించి ప్రస్తుతం బిగ్ బాస్ లాంటి ఒక మంచి ఫేస్ పైకి వెళ్లిన ప్రియాంక సింగ్ ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది.
తెలుగులో పాటు తమిళం మలయాళం హిందీ భాషల్లో కూడా ట్రాన్స్ జండర్ లను హౌస్ లోకి తీసుకున్నారు. కానీ అందరూ రెండు మూడు వారాల కంటే హౌస్ లో నిలబడలేకపోయారు. కానీ ప్రియాంక సింగ్ పది వారాల పైనే ఉంది. ఆమె ఫినాలే అడుగుపెట్టి గెలిస్తే అది వేరే వాళ్ళు ఉంటుంది కనుక అందరూ ఆమెకు సపోర్ట్ చేయండి అంటూ వీడియోను రిలీజ్ చేసింది.