పాన్ ఇండియా స్టార్ ఫ్యామిలీ నుంచి సింగర్ శ్రీరామ్ కు ఊహించని సర్ ప్రైజ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో మరో నాలుగు రోజులలో ముగియనుంది. దీనితో లోపలి కంటెస్టెంట్ లకు మద్దతు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ లలో సింగర్ శ్రీరామ్ కి సోషల్ మీడియా నుంచి సెలబ్రిటీల నుంచి గట్టిగానే సపోర్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీ రామ్ చంద్ర కు సపోర్టుగా పాయల్ రాజ్ పుత్, ఎండీ సజ్జనార్, శంకర్ మహదేవన్, సోను సూద్ తో పాటు పలువురు సెలబ్రిటీలు శ్రీరామ్ కు మద్దతుగా నిలిచారు.

ఇది ఇలా ఉంటే శ్రీ రామ్ కి మద్దతుగా తాజాగా ఏకంగా పాన్ ఇండియా స్టార్ కుటుంబం నుంచి మద్దతు వచ్చింది. ఎవరు అని అనుకుంటున్నారా.. టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు భార్య శ్యామల దేవి శ్రీ రామ్ కి మద్దతు ప్రకటించారు. వీడియో సందేశం ద్వారా శ్రీరామ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాయ్ శ్రీరామ్.. బిగ్ బాస్ షో చూస్తున్నాం.. నాకు కృష్ణం రాజు గారికి నీ పాటలు అంటే చాలా ఇష్టం.. ముఖ్యంగా భక్తి పాటలు అంటే ఇంకా ఇష్టం.. అప్పుడు ఇండియన్ ఐడల్ గెలిచి తెలుగువారందరికీ ఎంతో గర్వ కారణం అయ్యావు.. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా గెలవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపున కోరుకుంటున్నాను నువ్వు తప్పకుండా గెలుస్తావు..ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది.

Share.