తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. మరొక రెండు వారాల్లో బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంది. దీనితో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరుగుతోంది. తాజాగా సండే, ఫండే గా మార్చేందుకు సరికొత్త గేమ్ తో ముందుకు వచ్చాడు బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున. ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమా పాత్రలను కంటెస్టెంట్ లు ఒకరికి ఒకరు అంకితం ఇచ్చుకోవాలి అని ఆదేశించారు. ఈ క్రమంలోనే మహానటి పోస్టర్ చూడగానే సన్నీ వెంటనే ప్రియాంక పేరు చెప్పాడు. అయితే సావిత్రితో పోల్చినందుకు ప్రియాంక ఆనందపడుతుండగా అప్పుడు సన్నీ అంత లేదమ్మా నిన్ను సావిత్రితో పోల్చదగిన అమ్మా.. బాగా నటించే వ్యక్తి అని ఆ పేరు నీకు ఇచ్చాను అని తెలిపాడు.
సిరి డా.వశీకరన్ పాత్ర షణ్ముఖ్ జస్వంత్ కు బాగా సెట్ అవుతుంది అని తెలిపింది. అయితే అతను నన్ను కంట్రోల్ పెడతాడు అంటూ వాపోయింది.శ్రీరామ్ రేలంగి మామయ్య అని, సన్నీ అర్జున్ రెడ్డి అని,అలాగే మానస్ అపరిచితుడు అని పేర్కొన్నారు. ఇక వెంటనే నాగార్జున ఇంట్లో ఎవరు సింపతి కోసం ప్రయత్నిస్తారు అని ప్రశ్నించగా.. మానస వెంటనే కాజల్ పేరు చెప్పాడు. నా వాళ్లే నన్ను ఇలా అంటే ఎలా రా? అని కాజల్ ని ఇమిటేట్ చేస్తూ డైలాగ్స్ చెప్పడం తో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.