బిగ్ బాస్ :చిన్నపిల్లల ఎగిరి గంతేసిన సిరి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. మరో నాలుగు రోజుల్లో ఈ బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకోనుంది. దీనితో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరిగింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి మరికొన్ని రోజులు సమయం ఉండడంతో టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్ ల జర్నీ వీడియోలు చూపిస్తూ వారిని సంతోష పరుస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే శ్రీ రామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సన్నీ ల వీడియోలు చూపించాడు.ఈ క్రమంలోనే తాజాగా కంటెస్టెంట్ సిరి కి సంబంధించిన వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో ఆమె జ్ఞాపకాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సిరి తన ఫోటోలను చూసుకుని తెగ మురిసిపోయింది.

ఈ క్రమంలోనే ఎగిరి గంతులు వేసింది సంతోషం పట్టలేక సిరి చిన్న పిల్లలాగా ఎగిరి గంతేసింది. మీరు నమ్మిన దానికోసం మీ గొంతును గట్టిగా వినిపించారు. అంతేకాకుండా బిగ్ బాస్ ఇల్లు ఎన్నో భావోద్వేగాల నిధి అయితే అందులో సిరి మీరు అంటూ సిరి గురించి గొప్పగా గట్టిగానే ఇచ్చాడు ఎలివేషన్స్ ఇచ్చాడు. ఇక సిరి జర్నీ ని చూడాలి అంటే ఎపిసోడ్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

Share.