లెక్క తేలాల్సిందే,ఓట్లు చూపించండి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రవి ఫ్యాన్స్?

Google+ Pinterest LinkedIn Tumblr +

12వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడం అతని ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది. అయితే ముందుగా సోషల్ మీడియాలో వినిపించిన వార్తలు నిజం అయ్యాయి. రవి బిగ్ బాస్ హౌస్ ను వీడనున్నాడన్న వార్త బయటకు రాగానే అతడి ఫ్యాన్స్ షో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 3లో ఉంటాడు అనుకున్న రవి టాప్ 5 కి రాకముందే ఎలా ఎలిమినేట్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

కాజల్, సిరి, ప్రియాంక ల కంటే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవి కి తక్కువ ఓట్లు ఎలా వస్తాయి అని నిలదీస్తున్నారు. ఒకవేళ నిజంగా ఆ ముగ్గురి కంటే తక్కువ ఓట్లు వచ్చినట్లు అయితే ఓట్ల లెక్క చూపించమని డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు లేడీ కంటెస్టెంట్ లను కాపాడటం కోసం రవిని అన్యాయంగా బయటకు పంపించే చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవి సడన్ గా ఎలిమినేట్ అవ్వడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. రవి లేని బిగ్ బాస్ షో ను తాము చూడలేము అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయాలపై బిగ్ బాస్ నిర్వాహకులు ఏమని స్పందిస్తారో చూడాలి మరి.

Share.