తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 13 వ వారం కూడా ముగియనుంది. అయితే మరొక రెండు వారాల్లో బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. దీంతో కాంటెస్టెంట్ ల్ మధ్య పోటీ పెరిగింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు. ఇందులో ఏడుగురు నామినేషన్ లో ఉండగా అందరిలో కంటే శ్రీరామ్ భారీ ఓట్లతో ముందువరుసలో దూసుకుపోతున్నారు.
ఇక 13వ వారం ఎలిమినేషన్ కూడా దగ్గర పడింది. దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం కాజల్, ప్రియాంక లో ఎవరో ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవుతారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత వారం ఎవరూ ఊహించని విధంగా రవిని ఎలిమినేట్ చేయడంతో ఈవారం కూడా పింకీ, కాజల్ ని సేవ్ చేసి మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేస్తారా అన్న భయం పట్టుకుంది. ఇక ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి పింకీ ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.