బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ ఏ కంటెస్టెంట్ ఎలా మారతారో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో ఓ అంచనా వేయడం చాలా కష్టం. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడం అనేది ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. టాప్ త్రీ పొజిషన్ లో ఉంటాడు అనుకున్న రవి సడన్గా ఎలిమినేట్ అవ్వడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై బిగ్ బాస్ పై పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.
రవికి కాజల్, సిరి, ప్రియాంక కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అంటే నమ్మలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రవి అభిమానులు అతడు మళ్లీ హౌస్ లో కొనసాగాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వాదన ఒకవైపు అయితే మరొకవైపు 12 వారాలకు రవి ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడు అన్న వార్త ఆసక్తికరంగా మారింది.బిగ్ బాస్ రవికి వారానికి 7 నుంచి 8 లక్షల వరకు చెల్లిస్తున్నారట. చూస్తుంటే 12 వారాలకు దాదాపుగా 90 లక్షల రూపాయల వరకు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది బిగ్ బాస్ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్ మణి కంటే ఎక్కువ కావడం గమనార్హం.