పింకీ కోసం రవిని ఎలిమినేట్ చేసారా.. అందులో నిజమెంత?

Google+ Pinterest LinkedIn Tumblr +

సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం 12 వ వారం బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం రవి అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ షో నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది అన్ పెయిర్ ఎలిమినేషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బ్రింగ్ బ్యాక్ రవి అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది ప్రియాంక ని సేవ్ చేయడానికి రవి నీ కావాలని ఎలిమినేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. మానస్ కు కంటెంట్ ఇవ్వడం తప్ప కొన్ని వారాలుగా పింకీ ఆట కూడా యాక్టివ్ గా ఆడ లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ విషయంలో తీసుకుంటే రవి కంటే పింకీ కి చాలా తక్కువగా ఉందని అలాంటప్పుడు పింకీ ని ఎలా సేవ్ చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సన్నీ దగ్గర ఉన్న ఏ విషయం ఫ్రీ పాస్ కాజల్ కోసం వాడటం వల్ల రవి బలయ్యాడనే వార్త బయటకు వినిపిస్తోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Share.