బిగ్ బాస్ కోసం నడిరోడ్డుపై రచ్చ చేసిన హీరోయిన్…?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ ఐటం బాంబ్ రాఖీ సావంత్.. హిందీ సినిమాల్లో పలు ఐటం సాంగ్స్‌లో నటించి ఫుల్ పాపులర్ అయింది. ఈ భామ తెలుగులోనూ ఓ చిత్రంలో ఐటం సాంగ్‌లో నటించింది. వివాదాలకు ఎప్పుడూ కేరాఫ్‌గా ఉండే ఈ భామ తాజాగా ముంబై వీధుల్లో రచ్చరచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎందుకలా చేసిందంటే..త్వరలో ‘బిగ్‌బాస్‌ 15 ఓటీటీ’ రియాలిటీ షో స్టార్ట్ కాబోతున్నది. ఈ క్రమంలో తనను ఆ షోలోకి పార్టిసిపెంట్‌గా ఎందుకు తీసుకోలేదని నిరసన తెలిపింది.

ఈ క్రమంలోనే తనను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పైడర్ ఉమన్ గెటప్‌లో ముంబై వీధుల్లో తిరుగుతూ సందడి చేసింది. తాను ‘రాఖీని కాదని.. స్పైడర్ ఉమన్‌ను‌’ అని పేర్కొంటూ ఫన్నీ తింగ్స్ చేసింది రాఖీ సావంత్. ‘బిగ్ బాస్’ షో అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. ఓటీటీ సీజన్‌లోకి తనను ఆహ్వానించకపోవడం వల్ల బాధపడుతున్నట్లు తెలిపింది. సిద్ధార్థ్ శుక్లా, షెహ్నాజ్‌గిల్‌ను ‘బిగ్‌బాస్’కు ఆహ్వానించి, తనను ఎందుకు ఆహ్వానించలేదని రాఖీ ప్రశ్నించింది.

Share.