షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియాలో బాగా ఫాలో అయ్యే వారికి ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్ లో వీడియోలు ద్వారా ఇతను బాగా ఫేమస్ అయ్యాడు. ఇతడు నటించిన పలు వెబ్ సిరీస్ లకు అయితే ఏకంగా మిలియన్ వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఆ క్రేజ్ తోనే షణ్ముఖ్ జస్వంత్ కి బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షోలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకడిగా నిలిచాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదట సైలెంట్గా టాస్క్ లకు దూరంగా ఉంటూ వచ్చాడు.
ఇక రాను రాను తనదైన స్టైల్ లో ఆట ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నెంబర్ వన్ పొజిషన్ లో సన్నీ ఉండగా, నెంబర్ 2 పొజిషన్ లో షణ్ముఖ్ ముందు ఉన్నాడు. ప్రస్తుతం హౌస్ లో సన్నీ, షణ్ముఖ్ ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాకముందే షణ్ముఖ్ జస్వంత్ ఒక బంపర్ ఆఫర్ కొట్టేసిన టు తెలుస్తోంది.షణ్ముఖ్ హీరోగా ఒక సినిమాలో నటించబోతున్నాడట. బిగ్ బాస్ ద్వారా షణ్ముఖ్ కి మరింత ఫాలోయింగ్ పెరగడంతో దర్శకనిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారట. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే షణ్ముఖ్ జస్వంత్ ఒక సినిమాలో నటించబోతున్నాడు అని సమాచారం. మరి ఇంత వరకూ యూట్యూబ్ లో నటించి అక్కడి ప్రేక్షకులను అలరించిన షణ్ముఖ్ వెండితెర నటించి వెండితెర ప్రేక్షకులను అలరిస్తాడో? లేదో?చూడాలి మరి