తాజాగా బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం ఎలిమినేషన్ సందర్బంగా హౌస్ నుంచి అనీ మాస్టర్ ఎలిమినేట్ అయింది. చివరివరకు ప్రియాంక, యాని మాస్టర్ ఎలిమినేషన్ రేసులో ఉండగా, చివరి నిమిషంలో పింకీ సేవ్ అవ్వగా అనీ మాస్టర్ ఎలిమినేషన్ అయ్యింది. ప్రియాంక,అనీ మాస్టర్ లలో అనీ మాస్టర్ స్ట్రాంగ్ ప్లేయర్.ప్రియాంక విషయానికి వస్తే ఈమె తన కంటే ఎక్కువగా మానస్ పై ఫోకస్ పెడుతూ గేమ్ ని పక్కన పెడుతుంది. ఈ విషయంలో కూడా ఆమె విమర్శలను ఎదుర్కొంది.
అయితే అనీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు.అనీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఆమె నోటి దురుసు. ఏ విషయంలోనైనా తను చాలా పర్ఫెక్ట్ అని అతి నమ్మకంతో ఉండటం. అలాగే అందరిపై కోపంగా అరవటం, గ్రూపులుగా ఆడుతున్నారు అనడం, ఎమోషనల్ అవ్వడం, కాజల్ ను డాన్స్ చేస్తూ వెక్కిరించడం లాంటివి అని మాస్టర్ కు మైనస్ అయ్యాయి అని చెప్పవచ్చు.దీంతో అనీ మాస్టర్ కు తక్కువ ఓట్లు పడ్డాయి. అలా 11వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.