13 వారాలకు ప్రియాంక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. అయితే సోషల్ మీడియాలో ముందు నుంచి వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ వారం అనుకున్న విధంగానే ప్రియాంక ఎలిమినేట్ అయింది. ఇప్పటికే రెండు మూడు సార్లు ఎలిమినేట్ నుంచి తప్పించుకున్న పింకీ 13వ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. కానీ బిగ్ బాస్ టాప్ ఫైవ్ పొజిషన్ లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో 13 వారాలకు గాను పింకీ ఎంత రెమ్యూనరేషన్ అందుకుంది అన్న వార్త ఆసక్తికరంగా మారింది .

ఒక సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రియాంకకు వారానికి 1.75 నుంచి రెండు లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అంటే ఆ ప్రకారంగా 13 వారాలకు గాను ఈమె పాతిక లక్షల వరకు వెనకేసుకునట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో అందం ఆటతీరుతో ప్రియాంక ఎంత మంది మనసులను గెలుచుకుంది. అలాగే బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

Share.