షణ్ముఖ్ కి సూపర్ హిట్ ఇచ్చిన దీప్తి సునయన..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్స్‌కు మరోసారి కుటుంబ సభ్యులను చూపించి, సంతోషపరిచాడు హోస్ట్‌ నాగార్జున. అయితే దీని కోసం హౌస్ మేట్స్ వారికీ ఇష్టమైన వస్తువులని శాక్రిఫైజ్ చేసే టాస్క్‌ ను ఇచ్చాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ తమ కుటుంబ సభ్యులను స్నేహితులను చూడటం కోసం తమకు ఎంతో ఇష్టమైన వస్తువులను కూడా త్యాగం చేయడానికి ఓకే అన్నారు.ఈ క్రమంలో షణ్ముఖ్‌ కూడా తన ప్రియురాలు దీప్తి సునైనా ఇచ్చిన టీషర్ట్‌ని త్యాగం చేయడంతో అతని అన్నయ్య స్టేజ్‌ మీదకు వచ్చాడు.

ఆ తర్వాత దీప్తి సునైనా కూడా రావడంతో షణ్ముఖ్‌ ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. ఇక షణ్ముఖ్ తో మనసు విప్పి మాట్లాడిన దీప్తి ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్‌ అయిపోవద్దని సూచించింది. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా దీప్తి తెలివిగా షణ్ముఖ్‌కి ఓ హింట్‌ ఇచ్చిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె వచ్చిరావడంతోనే రెండు వేళ్లతో మైక్‌ని పట్టుకుంది. అంటే తను రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.సచ్చినోడా అని ప్రేమగా అంటూనే చేతి వేళ్లతో సైగలు చేసింది. ఇక షణ్ముక్ కూడా వేళ్ల వైపు చూసి చూడనట్లుగా చూశాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతేకాదు, గ్రాండ్ ఫినాలే లో కలుద్దాం అంటూ మరో హింట్‌ కూడా ఇచ్చింది.

Share.