బిగ్ బాస్ షో మరొక రెండు వారాల్లో ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ లు ఉండగా అందులో ఇద్దరినీ బయటకు పంపించి మిగతా అయిదుగురు ట్రోపి కోసం పోటీ పడనున్నారు. ఇక ఈ వారం షణ్ముఖ్, సన్నీ తప్ప మిగిలిన కంటెస్టెంట్ లు అందరు నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే బయటికి వస్తారు అన్న వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వారం లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే బిగ్ బాస్ హౌస్ లో మేల్ కంటెస్టెంట్ లకు ఈమెయిల్ కంటెస్టెంట్ లు టఫ్ గా పోటీ ఇస్తున్నప్పటికీ ఫాన్స్ ఫాలోయింగ్ లో కొంత వెనకబడి ఉన్నారు. ఇకపోతే ఈ వారం హౌస్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవ్వడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు. గత వారమే ప్రియాంక ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. యాంకర్ రవి ని ఎలిమినేట్ చేసి ఆమెను సేవ్ చేశారు. కానీ ఈ వారం మాత్రమే తప్పకుండా పింకీ బయటకు వచ్చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.