కరోనా మహమ్మారి వచ్చిన గత రెండు సంవత్సరాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ ప్రాణాలను కోల్పోయారు. ఇకపోతే యూనివర్సల్ స్టార్ గా గుర్తింపు పొందిన కమలహాసన్ కూడా కరోనా బారిన పడడంతో ఆయన అభిమానులంతా తెగ ఆందోళన వ్యక్తం చేశారు.. కానీ తాజాగా అందిన బులెటిన్ ప్రకారం.. ఈయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు అని అధికారిక ప్రకటన విడుదలైంది. నవంబరు 22వ తేదీన ఆయనకు కరోనా సోకినట్లు అధికారికంగా ప్రకటన వెలువడటంతో ప్రతి ఒక్కరు కంగారుపడ్డారు.. కానీ ఆయన , ఆయన కూతురు శృతి హాసన్ కంగారు పడాల్సిన పని ఏమీ లేదు అంటూ తెలిపారు.
ఈరోజు ఉదయం కమల్ హాసన్ కు చికిత్స అందిస్తున్న రామచంద్ర మెడికల్ సెంటర్ వారు అధికారిక ప్రకటన విడుదల చేయడంతో..ఆయన పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 3 వరకు హాస్పిటల్ లోనే ఉండి, డిసెంబర్ 4వ తేదీన ఆయన యధావిధిగా తన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు , అభిమానులు అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.