బిగ్ బాస్ -5 తెలుగు లో చివరి వారానికి చేరుకుంది. మామూలుగా చివరి వారంలో హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిగులుతారు. అలాగే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో శ్రీ రామచంద్ర, సన్నీ, షణ్ముక్, సిరి, మనసస్ వంటి వారు మిగిలారు. ఈ ఐదుగురికి బయట సమానంగా ఓట్లు లభించాయట. అయితే ఇంతలోనే ఈ ఐదుగురు నుంచి ఒకరు ఎలిమినేట్ చేశారని సమాచారం.
మామూలుగా బిగ్ బాస్ రియాల్టీ షో చివరివారం చేరుకున్న తర్వాత ఎలిమినేట్ లాంటివి ఏమీ ఉండవు. డైరెక్టర్ గా ఫైనల్ ఎపిసోడ్ లోనే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ విన్నర్ ఎవరు అనౌన్స్ చేసేవారు. కానీ ఈసారి బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్ గా మార్చడం జరిగింది. ఫైనల్కు ఇంకా రెండు మూడు రోజులు ఉండగానే ఒక కంటెస్టెంట్స్ ను హౌస్ బయటకు పంపించే విధంగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఏది ఏమైనా ఈ రోజున సిరి ని అవుట్ చేస్తున్నారనే సమాచారం వెలువడింది.