ఈ ఏడాది విడుదలైన బిగ్ బాస్ -6 సీజన్ త్వరలోనే ముగియనుంది. అయితే ఈ సీజన్ మాత్రం అట్టర్ ప్లాప్ అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. గత సీజన్లకు దారుణంగా ఈ సీజన్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా మొదటి వారం నుంచి ఈ షో పైన ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కంటెంట్ ఎంపిక ఆటతీరు ఆడియన్స్ నచ్చకపోవడంతో బిగ్ బాస్ నిర్ణయాలు ఎలిమినేషన్ పైన కూడా పలు విమర్శలు వెళ్ళబడ్డాయి. ఈ షో లో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరికి అర్థం కావడం లేదు.
ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ షో పైన మరింత నెగటివ్ పెరిగిపోయింది ఫైనల్ గా ఉండాల్సిన తను ఓటింగ్కు విరుద్ధంగా బయటకు పంపించారని గేమ్ ఆడకుండా సోది కబుర్లు చెబుతున్న వారందరినీ ఇంట్లో ఉంచుతున్నారంటు విమర్శలు వెళ్ళబడ్డాయి. హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున పైన కూడా కొంతమంది ప్రేక్షకులు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. కానీ నాగార్జున ఇవేవీ పట్టించుకోకుండా బిగ్ బాస్ షోను ఫైనల్ వరకు తీసుకురావడం జరిగింది నిర్వాహకులు.
మరికొన్ని గంటలో సీజన్ -6 విజేత ఎవరన్నది తెలియబోతోంది. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కు హోస్టుగా నాగార్జున షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ షోకు నాగార్జున గుడ్ బై చెప్పబోతున్నట్లుగా సమాచారం. ఇక మీదట ఈ షో కి వ్యాఖ్యాతగా ఉండను అంటూ తేల్చి చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇనయ ఎలిమినేషన్ అనే టాక్. ఇనయ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ కావడంతో చాలా మంది తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ కారణంగానే నాగార్జునా హోస్ట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సీజన్ కు విజయ్ దేవరకొండ వ్యాఖ్యాతగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో చూడాలి.