బిగ్ బాస్-6 ఈరోజుతో ముగియానుంది. ఇందులో కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆదిరెడ్డి. ఇక తన ఆట తీరుతో ప్రవర్తనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా తన ఆట తీరుతో ఫినాలే వరకు నెట్టుకొచ్చారు. అయితే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ కు చేతులెత్తి ప్రస్తుతం దండం పెడుతున్నారు. తన మార్క్ వ్యూహాలు టాలెంట్ తో ఫినాలే వరకు దూసుకు వచ్చారు అప్పుడప్పుడు తప్పులు చేసినప్పటికీ వాటిని సరిదిద్దుకుంటూ వచ్చారు ఆదిరెడ్డి.
బిగ్ బాస్ సీజన్ 6 లో 3 రన్నర్ గా నిలిచారు. అయితే ఆదిరెడ్డి బిగ్ బాస్ ఇంట్లో 15 వారాలు ఉన్నారు కాబట్టి అతడు ఎంతటి రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. 15 వారాలకు గారు ఆదిరెడ్డి కేవలం రూ.7.5 లక్షల రూపాయలు వచ్చినట్లు ఆదిరెడ్డి సన్నిహితుల నుంచి సమాచారం అంటే వారానికి రూ.50వేల రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. ఆదిరెడ్డి యూట్యూబ్లోనే ఎక్కువగా సంపాదించిన ఇంత వస్తుంది కదా అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
యూట్యూబ్లో కూడా ఆదిరెడ్డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు తన ఫ్యామిలీతో కలిసి చేసే వీడియోలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. సగటు మధ్యతరగతి నుంచి వచ్చి బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయ్యారు కానీ అంతగా సంపాదించుకోలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ ఫేమస్ను ఎలా ఉపయోగించుకుంటారు అనే విషయంపై ఇప్పుడు ఆయన అభిమానులు చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. మరి సినిమాలలోకి ఎంట్రీ ఇస్తారా? లేకపోతే బిగ్ బాస్ రివ్యూస్ ని యూట్యూబ్ లో కొనసాగిస్తూ ఉంటారా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి మరి.