ఆంధ్రా ఫ్యాన్స్ నుండి షాక్ తిన్న విజయ్ దేవరకొండ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన సినిమా నోటా. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చింది. అయితే సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు కలక్షన్స్ బాగున్నా రెండో రోజు, మూడవర రోజు చతికిల పడ్డది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

సినిమా పక్కా హిట్ అని ఆంధ్రా ఆడియెన్స్ తో ప్రమాణం చేసిన విజయ్ దేవరకొండ సినిమా నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నాడు. అందుకే విజయ్ మీద ఆంధ్రా ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా మీద అనవసరంగా అంచనాలను పెంచి ఇలాంటి సినిమా అందిస్తావా అంటూ విజయ్ దేవరకొండ మీద నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.

దీనిపై విజయ్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. వాస్తవానికి మంచి ఫాం లో ఉన్న విజయ్ ఇలాంటి టైంలో ఈ సినిమా చేయడం నిజంగానే అతన్ని రిస్క్ లో పడేసిందని చెప్పొచ్చు. ఇక రాబోతున్న టాక్సీ వాలా సినిమా మీద కూడా విజయ్ కు హోప్స్ లేవని టాక్.

Share.