పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాకి డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి పండక్కి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో తాజాగా కమెడియన్ బ్రహ్మానందం కూడా నటిస్తున్నాడు అనే వార్త వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో బ్రహ్మానందం సంబంధించి ఒక లుక్ ఇదే అంటూ ఒక పోస్ట్ వైరల్ గా మారుతుంది. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు.
అయితే ఇది వరకు కూడా పంజా వంటి మూవీ లో కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు బ్రహ్మానందం. అయితే భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడా లేదు క్లారిటీ తెలియాల్సి ఉంది.