పవన్ కళ్యాణ్-దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న తాజా చిత్రం. భీమ్లా నాయక్. ఈ సినిమాను డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం అనే రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిత్యా మీనన్ కూడా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక తాజాగా అడవి తల్లి అనే పాట కూడా విడుదలయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ పాట ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ పాటను ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ, సాహిత్య చాగంటికలిసి అలరించారు. మంచిర్యాల జిల్లా కు చెందిన.. కుమ్మరి దుర్గవ్వ ఈ పాటను పాడింది. ఆమె చదువుకోలేదు కూడా. కేవలం తెలుగులోనే కాకుండా.. మరాఠి లోనూ ఆమె అనేక పాటలు పాడింది.