కర్ణాటక సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మంచితనం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఆయనను మరిచిపోలేకపోతున్నారు. ఇకపోతే పునీత్ మరణం తర్వాత పద్దెనిమిది వందల మందికి చదువు చెప్పిస్తున్నాడని, ఎంతో మంది అనాధలకు, వృద్ధులకు ఆశ్రయాలు కట్టించాడని తెలిసి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా కంటతడి పెడుతున్నారు. ఇకపోతే పునీత్ రాజకుమార్ మరణించినా.. ఇప్పటికీ తమ మధ్య ఉన్నారని ఆయన పై ఉన్న ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.
ఆయనపై అభిమానం ఉన్న ఎంతోమంది అభిమానులు పునీత్ రాజ్ కుమార్ విగ్రహాలను తయారు చేయించుకుంటూ ఉండటం గమనార్హం. ఇక ఇందుకోసం తెనాలికి చెందిన శిల్పికి వెల్లువలా ఆర్డర్లు వస్తున్నాయట. అంతేకాదు తమ ఏరియాలలో ఆయన విగ్రహాలను ప్రతిష్టించాలి అని అభిమానులు తెనాలికి చెందిన శిల్పి కాటూరు శ్రీ వెంకటేశ్వరరావుకు ఆర్డర్లు ఇస్తున్నారట. దీంతో ఆయన తన కుమారుల అయినటువంటి రవిచంద్ర , శ్రీహర్ష లతో కలిసి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పునీత్ రాజ్ కుమార్ మినియేచర్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. వీటిని సూర్య శిల్ప శాల లో ప్రదర్శనకు కూడా పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.