బాహుబలిలో ఐటమ్ సాంగ్ లో మెరిసిన ఈ భామ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి.. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దిన తెలుగు సినిమా అని చెప్పవచ్చు. జక్కన్న దర్శకత్వంలో ఎంతో మంది హీరోలను ఇండియా హీరోలుగా తీర్చిదిద్దిన సినిమా ఇది. ఈ సినిమా ద్వారా ప్రభాస్ , రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ వంటి ఎంతోమంది నటీనటులకు మంచి కెరియర్ ను ఇచ్చింది ఈ సినిమా.బాహుబలి సినిమాలోని మనోహరి పాటతో వెండితెర మీద ఒక్కసారిగా మెరిసి ప్రస్తుతం వెబ్‌తెర మీద వెలిగిపోతోంది.

ఈమె అసలు పేరు మధుస్నేహ.. పుట్టింది కోల్‌కతాలో.. పెరిగింది ముంబైలో.చిన్నప్పుడే సినిమాల్లో నటించాలని, తల్లిదండ్రులకు తెలియకుండా ఆడిషన్స్‌కు వెళ్లి తన్నులు కూడా తినింది.చదువు పూర్తిచేయాలని గట్టిగా చెప్పడంతో మంచి మార్కులతోనే డిగ్రీ పట్టా సాధించింది.నటిగా స్థిరపడాలనే లక్ష్యంతో ఒకవైపు మోడలింగ్‌ చేస్తూ ఆడిషన్స్‌ అటెండ్‌ అయ్యేది.మొదటి అవకాశంతోనే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమాలోని ‘మనోహరి’ పాటలో ప్రభాస్‌తో పాటు డాన్స్‌ చేసింది.

ఆ పాట.. ఆ డాన్స్‌ ఆమెను అందరి దృష్టిలో పడేలా చేశాయి కానీ కొత్త అవకాశాలను ఇవ్వలేకపోయాయి. దీంతో సినిమాలను వదిలి సిరీస్‌లలో నటించడం మొదలుపెట్టింది.2018లో ‘ది ఎట్సెట్రాస్‌’ అనే కామెడీ వెబ్‌ సిరీస్‌లో నటించి, పాపులర్‌ అయింది. తర్వాత పలు యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ బిజీగా మారింది.ప్రస్తుతం ‘బేకాబూ’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.

Share.