బంగార్రాజు అప్పుడే వస్తాడట!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున ఆ మద్య నాని కాంబినేషన్ లో దేవదాస్ సినిమాతో థియేటర్లో సందడి చేశాడు. కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బంగార్రాజు గా నాగార్జున చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. నాగార్జున కెరియ‌ర్‌ని మార్చేసిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్‌గా మ‌న్మ‌థుడు 2 చిత్రం చేస్తున్నాడు నాగ్. ఇటీవ‌ల ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళ‌గా కొద్ది రోజుల పాటు ఈ మూవీ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది.

ఈ సినిమా గురించి నాగార్జున ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ..బంగార్రాజు అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. మ‌రి కొద్ది రోజుల‌లో క‌ళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలియ‌జేశాడు.

ఈ సినిమాలో నాగ్ సరసన మరోసారి రమ్యకృష్ణ నటించనున్నదట..అయితే బంగార్రాజు మనవడిగా నాగ చైతన్య నటించే అవకాశం ఉందట. ఆయ‌న‌కి జోడీగా ఎవరిని ఎంపిక చేయాలా అని చిత్ర‌బృందం క‌స‌ర‌త్తులు చేస్తుంద‌ట‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ బేన‌ర్‌పై ఈ చిత్రం నిర్మితం కానుంది.

Share.