బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం బంగార్రాజు. గతంలో నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున తో పాటు తనయుడు అక్కినేని నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇందులో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తుండగా, నాగార్జున రమ్యకృష్ణ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇదిలా ఉంటే ఇటీవలే రిలీజ్ అయిన వాసివాడి తస్సాదియ్యా ఫుల్ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకులను బాగానే లభిస్తోంది. ఈ పాటలో జాతిరత్నాలు ఫేమ్ పరియా అబ్దుల్లా కనువిందు చేసింది. ఈ సినిమా నుంచి తాజాగా మరొక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 23 గురువారం తో పూర్తి అయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో నాగచైతన్య కృతి శెట్టి లపై తీసిన పెప్పి మాస్ సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా నాగార్జున ట్వీట్ చేస్తూ చివరి షూటింగ్ రోజు ఇది. పండగ లాంటి సినిమా. బంగార్రాజు కమింగ్ సూన్ అని ట్వీట్ చేశారు నాగార్జున. వీటిలో చైతన్య కొత్త షెడ్యూల్ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share.