టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు పేరుతో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే ఇందులో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
Here’s #NaaKosam https://t.co/XaBO3LUx24 from #Bangarraju another beautiful melody from @anuprubens with @sidsriram magic .. happy listening !! @iamnagarjuna@IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @ZeeStudios_ @zeemusiccompany@zeemusicsouth
— chaitanya akkineni (@chay_akkineni) December 5, 2021
తాజాగా ఈ సినిమా నుంచి ఒక అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. నాకోసం నువ్వు అంటూ సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా, ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ వీడియో చివరి లో నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. తాజాగా ఈ పాటను రిలీజ్ చేయగా ఈ పాట కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈసినిమాను జి స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.