నాగార్జున , రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ సినిమాకి డైరెక్టర్ గా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా కొనసాగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనున్న ట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు గా సమాచారం. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే తాజాగా ఈ చిత్రం రిలీజ్ జనవరి 15వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక అధికార ప్రకటన వెళ్లి పడే అవకాశం కూడా ఉందట. అయితే అదే నెలలో పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ మూవీ భిమ్లా నాయక్ మూవీ కూడా జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక అంతే కాకుండా జనవరి 14 వ తేదీన ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల కానుంది.