బంగార్రాజు సినిమాలో మరొక అవకాశం కొట్టేసిన చిట్టి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో ఆమె చిట్టి అనే క్యారెక్టర్ లో నటించింది. దీంతో ఆమెను చిట్టి అని పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. తను నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక మంచు విష్ణు నటిస్తున్న ఢీ సీక్వెల్ లో ఫరియాను హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది.

ఇప్పుడు ఈ హీరోయిన్ కి మరొక సినిమా అవకాశం కూడా వచ్చినట్లు తెలిసింది. అక్కినేని హీరో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఫరియాను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలో నాగార్జున తో కలిసి మాస్ స్టెప్పులు ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.

ఇంకా హీరోయిన్ ఫరియా కూడా ఈమధ్య ఎక్కడపడితే అక్కడ డాన్సులు వేస్తూ అభిమానులను సంతోష పెడుతోంది. బంగార్రాజు సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు నాగార్జున. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక దాంతో పాటే సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.

Share.