బండ్ల గణేష్ అంటే ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఎక్కువగా మెగా ఫ్యామిలీ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఈయన. తాజాగా ఒక సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నాడు. మొదటగా కమెడియన్ గా ఎదిగి ఆ తర్వాత నిర్మాతగా మారాడు. ఇక అంతే కాకుండా మధ్యలో రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. కాంట్రవర్సి కామెర్ల మధ్య ఇబ్బంది పడడంతో తిరిగి సినిమాల్లోకి వచ్చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంత యాక్టివ్ గా ఉన్నాడు బండ్లగణేష్.
నాకు తెలిసిన నాకిష్టమైన తెలుగు జాతి రత్నాలు 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/7YmcW1gSAg
— BANDLA GANESH. (@ganeshbandla) December 10, 2021
అయితే తాజాగా తనకిష్టమైన తెలుగు జాతి రత్నాలు వీరే అంటూ 8 మంది ఫోటోలను షేర్ చేశాడు. అందులో వెంకయ్య నాయుడు, రామోజీరావు, సిజేఐ ఎస్వి రమణ, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్, చంద్రబాబు నాయుడు వారు ఇష్టమని బండ్ల గణేష్ తెలియజేశారు. బండ్ల గణేష్ ఎప్పుడు దేవుడు గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ కి మాత్రం ఈ లిస్టులో ప్లేస్ కనిపించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఈ విషయం పైన ఏదైనా రిప్లై ఇస్తారేమో వేచి చూడాల్సిందే.
నాకు తెలిసిన నాకిష్టమైన తెలుగు జాతి రత్నాలు 🙏🙏🙏 pic.twitter.com/8gKFvcRePt
— BANDLA GANESH. (@ganeshbandla) December 10, 2021