మెగాస్టార్ భార్యను టార్గెట్ చేస్తున్న బండ్ల గణేష్.. కట్ చేస్తే.!

Google+ Pinterest LinkedIn Tumblr +
ప్రముఖ నిర్మాతగా,  నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తరచూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ ఉండే ఈయన.. వ్యక్తిగతంగా మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇలా మెగా కుటుంబం గురించి తరచూ గొప్పలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 18వ తేదీన మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Cheating case against producer Bandla Ganesh
ఈసారి ఆమెను ప్రేమతో టార్గెట్ చేస్తూ.. బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ” సీతాదేవి అంత ఓర్పు.. భూదేవంత గొప్పతనం.. లక్ష్మీదేవి లాంటి నువ్వు.. రాముడు లాంటి భర్తకు అర్ధాంగిగా.. వజ్రం లాంటి బిడ్డకు తల్లిగా.. ఎందరో లక్ష్మణులకు వదినగా ఉండడం మాకెంతో సంతోషం.. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను”  అంటూ సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి సురేఖ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు బండ్ల గణేష్.
My wife is my stress buster, says Chiranjeevi
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.. బండ్ల గణేష్ ఈమధ్య కాలంలో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని చెబుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కెరియర్ మొదట్లో కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నిర్మాతగా మారి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి సినిమాలను నిర్మించకపోయినప్పటికీ కూడా పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
https://twitter.com/ganeshbandla/status/1626901666569277440?s=20
Share.