టాలీవుడ్ లోకి చిన్న కమెడియన్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన బండ్ల గణేష్ అంచెలంచెలుగా పెరిగి స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు. అయితే ఆయన ప్రొడ్యూసింగ్ పై పలు రకాల అనుమానాలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆయన కొంత మందికి బినామీగా వ్యవహరిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటిని కొట్టి పడేశారు బండ్ల. పవన్ తో తీసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత మనోడికి అన్నీ కలిసి వచ్చాయి. అయితే ఇటీవల తెలంగాణలో రాజకీయాల వైపు వెళ్లిన బండ్ల గణేష్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు.
కొంతకాలం క్రితం వరకూ స్టార్ హీరోలతో భారీ సినిమాలను నిర్మించిన బండ్ల గణేశ్, ఆ తరువాత కొన్ని కారణాల వలన సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల తెలుగు ‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులు ఆయనను సంప్రదించారట.తమ షోలో పాల్గొనమని కోరుతూ, ఆ షో గురించి పూర్తి వివరాలను చెప్పారట.
అయితే తాను ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తానని..అన్ని రోజులు ఒంటరిగా గడపడం తన వల్ల కాదని యాజమాన్యానికి చెప్పినట్లు సమాచారం. ఇక ‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులు, సీనియర్ హీరో ‘తొట్టెంపూడి వేణు’ను కూడా సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఏమన్నాడో తెలియాల్సి వుంది.