పవన్ కు నా విశ్వరూపం చూపిస్తానని ఇన్ డైరెక్టుగా సెటైర్ వేసిన బండ్ల గణేష్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో నిర్మాతగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు బండ్ల గణేష్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా తలుచుకొని చిత్రంగా నిలిచిపోయింది గబ్బర్ సింగ్. నిర్మాతగా బండ్ల గణేష్ కు డైరెక్టర్గా హరిశంకర్ కు ఈ చిత్రం ఎవరి గ్రీన్ అని చెప్పవచ్చు.

ఈ సినిమా విషయంలో గొడవలు జరిగాయా ఇంకెప్పుడైనా గొడవలు జరిగాయి అన్న సంగతి చాలా మందికి తెలియదు.. కానీ బండ్ల గణేష్ హరి శంకర్ మధ్య మంచి సంబంధాలు అయితే కనిపించడం లేదు. ఆ మధ్య ఇద్దరూ కూడా ట్విట్టర్ల చాలా హోరాహోరీగా గొడవలు పడడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ కలిసిపోయినట్లుగా ట్విట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ ,బాలయ్య అన్ స్టాపబుల్ షోలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాకు నేను అనుకున్నంత ఇవ్వలేదు కానీ తాను అనుకున్నంత ఇచ్చాడు అంటూ పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ గురించి బయట పెట్టాడు.

Pawan Kalyan and Bandla Ganesh to tie up for a new film | The News Minute

దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు .ఇదే విషయం మీద ఒక నెటిజన్.. కాస్త పౌరుషాంగ మాట్లాడాడు.. పరమేశ్వర పవనేశ్వర్ అంటూ రెమ్యూనరేషన్ బొక్క పెట్టావా అతిమింగే వాళ్ళందరూ బొక్క పెట్టే వాళ్లే అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.. దీంతో బండ్ల గణేష్ తెలిసి తెలియకుండా మాట్లాడకు ఎర్రి.. అంటూ ఫైర్ అయ్యారు. ఇంకొక నెటిజన్ బండ్ల గణేష్ పైన జాలి చూపిస్తూ అన్న ఇప్పుడు అర్థం అయ్యిందా? రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి.. నువ్వు పవన్ కళ్యాణ్ ని ఎంత అభిమానించావో తెలుగులో ఉన్న వారందరికీ తెలుసు కానీ ఒక పాపులర్ షో అని కూడా చూడకుండా అలా మాట్లాడాడంటే ఆయనకు నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో తెలుస్తోందా అంటూ ట్విట్ చేయడం జరిగింది. దీంతో బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ నా విశ్వారూపం కూడా చూపిస్తానని రిప్లై ఇచ్చాడు అంటే దీనిపై పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ అన్నాడని నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Share.