బాలకృష్ణ-విజయశాంతి మధ్య మాటలు లేకపోవడానికి కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ పెయిర్ గా నిలిచిన లిస్టులో బాలకృష్ణ విజయశాంతి జోడి కూడా ఒకటి. దాదాపుగా వీరిద్దరూ కలిసి 17 సినిమాలలో నటించారు. మొదటిసారిగా కె.మురళీమోహన్ రావు డైరెక్షన్లో తెరకెక్కించిన కథానాయకుడు సినిమాతో జత కట్టిన ఈ జంట మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు. ఆ తరువాత వీరిద్దరికీ మంచి క్రేజ్ పెరిగింది.

ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, అపూర్వ సోదరులు, రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పురవ్వ, ఇక ఇవే కాకుండా మరికొన్ని సినిమాల్లో నటించారు. అయితే ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన బాలయ్య విజయశాంతి. కొన్నాళ్లపాటు మాట్లాడుకోలేదు అని వార్త బాగా పాపులర్ అయింది. బాలకృష్ణ కు విజయశాంతి అంటే ఎంతో అభిమానం. పైగా వీరిద్దరి మధ్య స్నేహబంధం కూడా ఉండేది. అయితే వీరిద్దరి స్నేహాన్ని చూసి ఓర్వలేక కొందరి ప్రేమికులు వారిపై అసత్య ప్రచారాలు చేశారట. దాంతో వీరిరువురు కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకో లేదని సమాచారం.

బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించిన చివరి చిత్రం నిప్పురవ్వ. ఈ సినిమా తర్వాతే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు బాగా చక్కర్లు కొట్టాయి.

Share.