నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. బాలయ్య బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం అఖండ ఈ రోజున విడుదలైంది. ఈ సినిమాకి డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో మూవీ కి సంబంధించి టీజర్ ట్రైలర్ విడుదల చేయడం వల్ల ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి అని చెప్పవచ్చు.
దీంతో ఇక ఈ సినిమాను చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక నిన్నటి రోజున రాత్రి ఓవర్ సిస్ లో ప్రదర్శించడం జరిగింది. పలుచోట్ల ఫ్యాన్సీ షోనే ప్రదర్శించడం జరిగింది.దీంతో ఇప్పటికే అఖండ సినిమా చూసిన ఆడియన్స్ తమ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. పలువురు సినీ ప్రముఖులు బాలయ్యబాబు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
ఇక ఆడియన్స్ టాక్, ట్విట్టర్ పోస్ట్ లు ఆధారంగా చూస్తే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయినట్లు తెలుస్తోంది. ఫస్టాఫ్ సినిమా అంతా అదిరిపోయిందని.. మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా బాలయ్య నటించాడని.. ఇక సెకండాఫ్ అంతకుమించి మాస్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా సినిమాను తెరకెక్కించడం జరిగిందని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్ ను తమ తమ పాత్రల అద్భుతంగా నటించారని తెలియజేశారు. ఇక మొత్తంమీద అఖండ సినిమా బాలయ్య ఫాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చినట్లే అనే టాక్ వినిపిస్తోంది.
1st hlf adirindi 🔥
Mamul mass kaadamma idi daarunam
Vereeee@MusicThaman bgm 🎶
Boyapatiii's pure mark #JAIBALAYA #AkhandaRoaringFrom2ndDec #AkhandaMassJathara #Leicestershire pic.twitter.com/GKMquHhd8B— ® (@7IN_DIAN) December 1, 2021