ఇండస్ట్రీలో ఒక వ్యక్తిని అందరూ ఇష్టపడాలి అన్న నియమ నిబంధనలు ఏమీ లేవు.. ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్కరికి నచ్చవచ్చు.. మరొకరికి నచ్చకపోవచ్చు.. బాలయ్య బాబు అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో.. ఇష్టపడని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు అని తాజా సమాచారం. పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని , ఎమ్మెల్యే అనే అహం కూడా బాలయ్యకు ఉందని కొంతమంది చెప్పే మాట ఇది.. ముఖ్యంగా అభిమానులను చేయి చేసుకునే విధానమే అందుకు గొప్ప ఉదాహరణ అని చెబుతూ ఉంటారు.
బాలయ్య అంటే పడని హీరోల్లో రవితేజ కూడా ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి మధ్య చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల చిన్న గొడవ కూడా జరిగిందట. ఆ రోజు నుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవని.. సినిమాల రిలీజ్ విషయంలో కూడా దెబ్బలు ఆడుకుంటారు అని సమాచారం. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రవితేజ ..బాలయ్య షో కి గెస్ట్ గా రాబోతున్నాడట. ఇక ఇప్పటికే వీరిద్దరి మధ్య మాటలు లేవు.. మరి ఈ షో కి వస్తే వీరిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.