భారమంతా జయమ్మ మీద వేసిన బాలయ్య..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ ఏడాది సంక్రాంతికి మెగా హీరో ,నందమూరి హీరో మధ్య గట్టి పోటీ నెలకొననుంది. ఇక ఈ రెండు సినిమాల పాటలు టీజర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది .ముఖ్యంగా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో పాటలు వీర సింహారెడ్డి లోని టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.. గతంలో వీరిద్దరి సినిమాలు సంక్రాంతికి పోటీగా ఎన్నో విడుదలయ్యాయి. అయితే ఈసారి ఎవరు ఇమేజ్ కు తగ్గట్టుగా వాళ్ళ సినిమాలు ఆడతాయని తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా వీర సింహారెడ్డి సినిమా గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.

Varalaxmi Sarathkumar in Balakrishna film?

అదేమిటంటే గోపీచంద్ బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది కావడంతో ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో క్రాక్ సినిమాతో గోపీచంద్ మంచి విజయాన్ని అందుకోగా బాలయ్య అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాలో కూడా సెంటిమెంట్ చాలా గట్టిగానే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్యకు చెల్లెలి పాత్రలో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సెంటిమెంట్లు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయని సమాచారం.

ఇక సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ కు థియేటర్లకు వస్తారు కాబట్టి సెంటిమెంట్ సన్నివేశాలు వారిని ఆకర్షించేలా ఉపయోగపడతాయని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమాకి కి రోల్ వరలక్ష్మి శరత్ కుమార్ అనే సమాచారం. ఇందులో ఒక ట్విస్ట్ కూడా హైలెట్గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది ఆర్టిస్టుని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చిత్ర బృందం చాలా సందేహంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ ట్విస్ట్ ఏమై ఉంటుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా పూర్తిగా ఈ సినిమా గురించి తెలుసుకోవాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share.