టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫ్యామిలీలో బాలయ్యకి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ కూడా బాలయ్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. థియేటర్లలో కలెక్షన్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ మధ్యనే వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. అంతకుముందు అఖండ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు బాలయ్య. అంతేకాకుండా ఈమధ్య ఆన్ స్టాపబుల్ షో ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు.
ప్రస్తుతం ఎన్.బి.కె 108 సినిమా చేస్తున్నాడు. కానీ నందమూరి తారకరత్న మరణించడంతో సినిమా షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేశారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని కూడా ఫిక్స్ చేయబోతున్నాడట బాలయ్య. అంతేకాకుండా ఓ కమర్షియల్ యాడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేదశ్రీ అనే జ్యువలరీ బాలయ్య ఓకే చేశారు. ఆ యాడ్ కోసం అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ తో ఆయన జోడి కట్టాడు. ఇంతకుముందే అఖండ సినిమాతో వీరిద్దరూ ఎంతో పాపులర్ అయ్యారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లోనూ సక్సెస్ మీట్లలోను ప్రగ్యా బాలయ్యతో ఆడి పాడింది. అంతేకాదండి బాలయ్యతో మరో సినిమాలో కూడా అవకాశం దక్కించుకోబోతోంది ఈ అమ్మడు.
ఇలా ప్రగ్యాకి పదే పదే ఛాన్సులు ఇవ్వటం ఇండస్ట్రీలో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా బాలయ్య ప్రగ్యాకి మరీ ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఈ యాడ్ కి శృతిహాసన్ అయితే ఇంకా బాగుండేదని బాలయ్య ఫేవరెట్ హీరోయిన్ హనీ రోజ్ ని యాడికి పెట్టుకుంటే చాలా బాగుండేది అంటూ కొందరి కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు. చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎంతో ట్రెడిషనల్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఎవరినో ఒకరిని ఈ యాడికి పెట్టుకోవచ్చు కదా కేవలం ప్రగ్య కే బాలయ్య చాన్సులు ఎందుకు ఇస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.