ప్రస్తుతం ఉన్న కాలంలో హీరోయిన్స్ అందరూ కూడా వరుసగా వివాహాలు చేసుకొని సరికొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా వరసగా వివాహాలు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా బాలయ్య హీరోయిన్ కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యింది. ఆమె గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బాలయ్య తో నటించిన హీరోయిన్ ఎవరో కాదు నటి నటాషా దోషి.. ఈమె బాలయ్య నటించిన జై సింహ సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. జై సింహా సినిమాలో హీరోయిన్ గా నటించిన నటాషా దోషి సినిమాలలో తక్కువగా నటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంది.దీంతో అభిమానులకు తన గ్లామర్ ఫోటోలతో అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
తాజాగా తన ఎంగేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా తన నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేస్తూ తనకు కాబోయే భర్త పేరు మనన్ షా.. అని తెలియజేయడం జరిగింది అతనితో కలిసి త్వరలో ఏడడుగులు వేయబోతున్నానంటూ తెలియజేసింది నటాషా దోషి. తాజాగా నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేసిన ఈమె పెళ్లి విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.
ప్రస్తుతం ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె ఒక కొటేషన్తో ప్రేమ ఎప్పుడు విజయం సాధిస్తుంది అంటూ తెలియజేసింది. దీంతో ఈమె ప్రేమ వివాహం చేసుకోబోతోంది అంటూ స్పష్టంగా అర్థమవుతుందని పలువురు నెటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి వివాహమైన తర్వాత నైనా టాలీవుడ్లోకి రియంట్రి ఇచ్చి పలు చిత్రాలను నటిస్తుందేమో చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram