బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే హీరోగా రాణిస్తూ పలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ ఉన్నారు. ఇక మరొకవైపు రాజకీయాలలో రాణిస్తూనే.. మరొకవైపు అహ లో అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఇందులో ఎంతోమంది రాజకీయ నాయకులు సినీ సెలెబ్రేటీలో సైతం హాజరవుతూ వారి యొక్క విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇక మొదటి సీజన్ మంచి టిఆర్పి రేటింగ్ తో ముగింపు పలకగా.. గడచిన కొద్ది రోజుల క్రితం సెకండ్ సీజన్ ని ప్రారంభించారు ఈ సీజన్ కూడా మంచి క్రేజ్ తో దూసుకుపోతోంది.
ఈసారి ప్రసారమయ్యేటువంటి ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్ ను తీసుకువచ్చారు. ఈ ఎపిసోడ్ ఈనెల 30వ తేదీన ప్రసారం కాబోతోంది. అయితే ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుకు సంబంధించి ఒక ప్రోమో ఆహా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు.ఈ విషయాన్ని తమ ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరుగుతోంది. ఈ ప్రోమోలో ప్రభాస్ ను బాలకృష్ణ సరదా ప్రశ్నలతో సంభాషణ జరుగుతోందని ఈ ప్రోమో చూస్తే మనకు అర్థమవుతుంది.
ఇక బాలయ్య, గోపీచంద్, ప్రభాస్ మధ్య సెటైర్లు, సీక్రెట్లు సరదాలు సలహాలు కూడా ఇందులో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఈ ప్రోమో కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ప్రభాస్ ని అడగగా మనకి ఇంకా రాసి పెట్టలేదు అని చెప్పగా బాలయ్య అమ్మకు చెప్పే మాటలు నాకు చెప్పొద్దు అంటూ పంచి వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.