తెలుగు సినీ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా కంటే విలన్ గానే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది.ఈ సినిమా సక్సెస్ మీట్ లో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది బాలయ్యతో ఒక సన్నివేశం చేసేటప్పుడు ఆయన అభిమానులు గుర్తుకు వచ్చి చాలా భయపడ్డాను అని తెలియజేస్తోంది. సినిమాలో బాలయ్యను పొడిచి చంపేసి చేస్తున్నప్పుడు చాలా భయపడి చేశానని తెలిపింది.
ఇక ఆ సన్నివేశం చూసిన తర్వాత తన పైన బాలయ్య అభిమానులు పగ పెంచుకొని వచ్చి తనని చంపుతారేమో అని ఆందోళనలకు గురయ్యానని తెలుపుతోంది.. అయితే ఈ విషయాన్ని గమనించిన బాలయ్య నాలో ధైర్యం నింపి అభిమానులు ఆ సన్నివేశాన్ని నెగటివ్ గా తీసుకోరని తన ఫ్యాన్స్ బాగానే రిసీవ్ చేసుకుంటారని ధైర్యంగా చెప్పారట.. అయితే ఆయన చెప్పినట్టుగానే మీరందరూ నెగిటివ్గా రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేస్తోంది. ఈ సినిమా తర్వాత తాను బాలయ్యకు పెద్ద అభిమానిగా మారిపోయాను అంటూ తెలియజేసింది వరలక్ష్మి శరత్ కుమార్.
ఇక బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదలై దాదాపుగా రూ .120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మల్లిని దర్శకత్వం వహించారు.మైత్రి మూవీ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆదివారం రోజున వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.